Oil form cultivation | కాల్వ శ్రీరాంపూర్, జూన్ 6 : ఆయిల్ పామ్ సాగు కు రైతులు ముందుకు రావాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* అన్నారు. ఆయిల్ ఫామ్ మొదటి పంటగా 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మొదటి ఆయిల్ ఫామ్ గెలల కోతకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగుకు రైతులందరూ ముందుకు రావాలని, ఆయిల్ ఫామ్ సాగు తో రైతులకు అనేక లాభాలు ఉన్నాయని అన్నారు. ఆయిల్ పామ్ సాగు అవసరమైన మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన పత్తి శ్రీనివాసరెడ్డి అనే రైతు సెప్టెంబర్ 2011లో 2.50 ఎకరాలలో 150 చెట్లు నాటడం జరిగిందని, నాలుగు సంవత్సరాల తర్వాత కోతకు రావడం జరిగిందని, ఇదే స్ఫూర్తిని తీసుకొని మిగతా రైతులకు కూడా ఆయిల్ ఫామ్ ఏర్పాటుకు ముందుకు రావాలని అన్నారు. రైతుల సమస్యలు ఏమైనా ఉంటే తమకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. రైతులు కలెక్టర్ సూచన మేరకు ఉపాధి హామీ పథకంలో కూడా అంతర కృషికి కలుపు తీయడం చేర్చాలని, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని త్వరగా ప్రారంభించాలని రైతులు కలెక్టర్ కు విన్నవించారు.
రైతుల సమస్యల మేరకు కోతకు పూర్తయిన ఆయిల్ ఫామ్ రైతులకు త్వరగా డబ్బులు వారి ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మన జిల్లాలో వచ్చే సంవత్సరం మార్చిలోగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పూర్తి అవుతూ ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.అనంతరం గేలల కోత పూర్తయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి తీసుకెళ్తున్న వాహనానికి జిల్లా కలెక్టర్ జండా ఊపి ప్రారంభించారు.
శ్రీనివాస్ రెడ్డి పొలంలో ఆయిల్ ఫామ్ మొక్కను నాటారు. ఈ ఆయిల్ ఫామ్ తోట వేసినందుకు శ్రీనివాసరెడ్డి దంపతులను జిల్లా కలెక్టర్ శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్ అధికారి జగన్ మోహన్ రెడ్డి, ఏఎంసి చైర్మన్ తిరుపతిరెడ్డి, తహసిల్దార్ జగదీశ్వర్ రావు, ఆయిల్ ఫామ్ కంపెనీ సీఈవో కేసు కళ్యాణ్ కర్, మాజీ ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.