Farmers | ఓదెల, జులై 26 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో ట్రాన్స్కో సిబ్బంది పొలం బాట కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో ఎక్కువగా విద్యుత్ ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుందని, కావున రైతులు అప్రమత్తంగా ఉండాలని ట్రాన్స్కో అధికారులు సూచించారు. వర్షాకాలంలో జరిగే ప్రమాదాలపై తెలియజేసి పలు జాగ్రత్తలను సూచించారు.
తడి చేతులతో స్విచ్ఛులు వేయడం, కరెంటు ఇంజన్లను, స్టార్టర్లను ముట్టుకోవడం చేయవద్దని తెలిపారు. ఏదైనా కరెంటు సమస్య వస్తే మా ట్రాన్స్కో సిబ్బందికి తెలియజేయాలన్నారు. రైతులు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో డివిజన్ ఇంజనీర్ దాసరి తిరుపతి, టెక్నికల్ ఇంజనీర్ బాలయ్య, సబ్ ఇంజనీర్ శ్రీకాంత్, ఓదెల సెక్షన్ లోని ట్రాన్స్కో సిబ్బంది రాజయ్య, మునీశ్వర్, షారుక్, చిలుక ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.