Pothangal | పోతంగల్ మార్చి 17: అర్హులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి నిషిత తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన తెలిపారు.
ప్రభుత్వం రైతు పెట్టుబడి కింద అందించే రైతు భరోసా కోసం పిబ్రవరి 28.2026 వరకు కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు పొందిన రైతులతో పాటు ఇప్పటివరకు రైతు భరోసా పొందని అర్హులైన రైతులు, వివరాలు నమోదు చేయని రైతులు వెంటనే రైతు వేదికల వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ దరఖాస్తులు ఈ నెల 25 వరకు సమర్పించాలని అన్నారు. దరఖాస్తు పత్రంతో పాటు పట్టా పాస్, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, సంబంధిత పత్రాలు తీసుకురావాలని తెలిపారు.