Chigurumamidi | చిగురుమామిడి, మే 7 : రైతులు మేలైన సాగు పద్ధతులను పాటించాలని, వానాకాలం సాగుకు రైతులు సమాయత్తం కావాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ ఉమారాణి, జిల్లా కోఆర్డినేటర్ బీ హరికృష్ణ, ఆత్మా పీడీ చత్రు నాయక్, మనకొండూరు ఏడీఏ ఎన్ శ్రీధర్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి రైతు వేదికలో రైతు వారోత్సవాల్లో భాగంగా గురువారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వరికి బదులు ఆరుతడి పంటల సాగు చేసినప్పుడు భూగర్భ జలాల అభ్యంత పెరుగుదల, యూరియా వాడకం, పంట వ్యర్ధాలు కలియ దున్నడం ద్వారా భూసారాన్ని పెంపొందించుకోవడం మొదలు అంశాలను రైతులకు వివరించారు.
వరి రకాల సాగు, రసాయనాల వాడకం, పంట మార్పిడి సేంద్రియ వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ అంశాలను వివరించారు. ఆయిల్ ఫామ్, పందిరి సాగు, బిందు సేద్యం వంటి వాటిపై రైతులు దృష్టి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవనాధికారి మంజువాణి, మండల వ్యవసాయ అధికారి పున్నం చందర్, బొమ్మనపల్లి, రేకొండ సర్పంచులు కొంకట మౌనిక, అల్లేపు సంపత్, ఏఈఓ లు అఖిల, అంజలి, సతీష్, ప్రణయ్, రైతులు పాల్గొన్నారు. కాగా ఉద్యానవన పంటలపై రైతులకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారని, ఉద్యానవన అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు పలు ప్రాంతాలలోని రైతుల నుండి వినబడుతున్నాయి.