Saidapur | సైదాపూర్, ఆగస్టు 23: సైదాపూర్‌లో మండలకేంద్రం లోని venkepalli సైదాపూర్ సింగిల్ విండో వద్ద 440 యూరియా బస్తాలు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న సమీప గ్రామాల నుండి సుమారు 700 మంది రైతులు వచ్చారు. రైతులు యూరియా కోసం క్యూ కట్టి బారులు తీరారు. మండల వ్యవసాయ అధికారి వైదేహి తో పాటు పోలీసులు, సహకార సిబ్బంది రైతులకు టోకెన్ లు అందించారు.
ఒక రైతుకు ఒక టోకెన్ ఇచ్చారు. కొంత మందికే యూరియా దొరకగా రైతులు ఉత్త చేతులతో వెనుదిరిగారు. యూరియా కోసం లైన్ లో నిల్చున్న యూరియా దొరకలేదని రైతులు నిరాశ చెందారు. యూరియా అందరికి అందక ఇబ్బందులు పడుతున్నామని రైతులందరికి సరిపడా ఎరువులు అందిచలని రైతులు కోరుతున్నారు. రైతుకు ఒక యూరియా ఇచ్చిన ప్రయోజనం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు.