మారుతీనగర్, మే 11: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అధ్వానంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతున్నది. మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్కు ధాన్యం తెచ్చి రోజులు గడుస్తున్నా కాంటా పెట్టకపోవడంతో పశువుల పాలవుతున్నది.
ఓ వైపు అకాల వర్షాలతో ధాన్యం ఎక్కడికక్కడ తడిసిపోతున్న పరిస్థితి కనిపిస్తుండగా, మరోవైపు పర్యవేక్షణ, పట్టింపులేక ఆవులు, పందులకు ఆహారంగా మారుతున్నది. అధికారులు స్పందించి ధాన్యాన్ని త్వరితగతిన కొనాలని, మార్కెట్లోకి పశువులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.