Sultanabad | రైతులు తప్పక భూసార పరీక్షలు చేయించుకోవాలి.. సుల్తానాబాద్ ఏవో పైడితల్లి
రైతులు తప్పక భూసార పరీక్షలు చేయించుకోవాలని సుల్తానాబాద్ ఏవో పైడితల్లి సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే), రామగిరి ఖిల్లా నుండి శాస్త్రవేత్త డాక్టర్ పిల్లి కిరణ్ కుమార్తో కలిసి ఆమె సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామంలో రైతుల వద్దకు వెళ్లి మంగళవారం సమగ్ర ఎరువుల యాజమాన్యం, భూసార పరీక్ష ఆధారిత, ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Sultanabad | సుల్తానాబాద్ రూరల్, ఏప్రిల్ 21 : రైతులు తప్పక భూసార పరీక్షలు చేయించుకోవాలని సుల్తానాబాద్ ఏవో పైడితల్లి సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే), రామగిరి ఖిల్లా నుండి శాస్త్రవేత్త డాక్టర్ పిల్లి కిరణ్ కుమార్తో కలిసి ఆమె సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామంలో రైతుల వద్దకు వెళ్లి మంగళవారం సమగ్ర ఎరువుల యాజమాన్యం, భూసార పరీక్ష ఆధారిత, ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె డాక్టర్ కిరణ్ కుమార్తో కలిసి మాట్లాడారు. విచక్షణ రహితంగా పంటలపై ఎరువులు వాడడం ద్వారా పంట పెట్టుబడి పెరగడంతో పాటు భూసారం దెబ్బ తింటుందన్నారు.
రైతులందరూ తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకుని వాటి ఫలితాల ఆధారంగా సిఫారసు చేసిన ఎరువులను వాడడం ద్వారా పెట్టుబడి తగ్గించుకోవడంతో పాటుగా సూక్ష్మ పోషక లోపాలను అధిగమించవచ్చునని రైతులకు సూచించారు. భూసార పరీక్షల కోసం మట్టి నమూనాను సేకరించే విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో ప్రశాంత్, సర్పంచ్ రమేష్, ఉప సర్పంచ్ బొంగోని కుమార్ గౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

