Urea | గన్నేరువరం, ఆగస్టు15: రైతన్నకు యూరియా కోసం పడిగాపులు తప్పడం లేదు. మండలంలోని గుండ్లపల్లి లోని డీసీఎంఎస్ కు శుక్రవారం యూరియా రాగా రైతన్నలు షాప్ ముందు బారులు తీరారు.
పంటలకు యూరియా వేసుకుందామంటే కనీసం యూరియా బస్తాలు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదని వాపోయారు. అధికారులు మాత్రం యూరియా కొరత లేదని చెప్పడం ఏంటని మండిపడ్డారు. ఇప్పటికైనా రైతులకు యూరియా అందేలా చూడాలని కోరారు.