సైదాపూర్, ఆగస్టు 19: యూరియా (Urea) కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. తెల్లారకముందే సహకార సంఘాల ఎదుట భారీగా క్యూలైన్లు కడుతున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని సహకార సంఘానికి 230 బస్తాల యూరియా వచ్చింది. దీంతో మంగళవారం ఉదయమే భారీ సంఖ్యలో చేరుకున్న అన్నదాతలు క్యూలైన్లో తమ వంతుకోసం నిరీక్షిస్తున్నారు. అయితే సిబ్బంది రైతుకు ఒక బస్తా చొప్పున మాత్రమే పంపిణి చేశారు. కాగా లైన్లో వున్నప్పటికీ తమకు యూరియా దొరకలేదని పలువురు రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక బస్తా మాత్రమే ఇచ్చారని దీనివల్ల ఎం ఉపయోగం ఉంటుందని రైతులు వాపోతున్నారు. యూరియా అందిచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. అవసరాలకు అనుగుణంగా ఎరువులు అందించాలని కోరుతున్నారు.