loose wires | కొడిమ్యాల, జూన్ 30 : కొడిమ్యాల మండలంలోని నల్లగొండ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుట్ట వెనకాల 11 కేవీ వైర్లు పొలాల మధ్యలో కిందికి వెలాడి ఉన్నాయి. రైతులు బిట్ మడులు దున్నుకొని నాటువేసే సమయంలో చాలా ఇబ్బందిగా మారాయి.
ట్రాక్టర్ తో బీటు మల్లు సాగు చేసే సమయంలో ట్రాక్టర్ కు తగిలే స్థితిలో ఉన్నాయి. రైతులు కట్టెల సహాయంతో లూజు వైర్లను పైకి పట్టుకొని బీటు మడులు సాగు చేయాల్సిన దుస్థితి నెలకొంది. కావున ప్రమాదకరంగామారిన లూజు వైర్లను సరి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.