Purchasing centers | వేములవాడ రూరల్ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఫాజుల్ నగర్ గ్రామంలో రైతులు గురువారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆరుగాళ్ళు కష్టపడి పండించిన వడ్లను కొనుగోలు కేంద్రంలో లారీల లేక కొనుగోలు జరగట్లేదని అధికారులు చెబుతున్నారని రైతులు వాపోయారు.
లారీలను వెంటనే పంపించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఆశపెట్టి ఓట్లు దండుకున్నకాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కన్నీరు పెట్టిస్తుందని మండిపపడ్డారు. రైతులు ఇన్ని కష్టాలు పడుతున్నా.. స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. ఎమ్మెల్యే దృష్టి సారించి రైతుల కష్టాలను తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిందం కుమార్, పోగుల రాకేష్, పెద్దకూర్మ మల్లేశం, కొండవేని మోహన్, మునిందర్ రెడ్డి, ఎగుర్ల రాజు, అంజయ్య, ఓదెలు, సాయిలు, రైతులు పాల్గొన్నారు.