Kalvacherla | కల్వచర్లలో తూములు కొల్లగొట్టి చెరువు నీరు వదులుతున్నారంటూ తహసీల్దార్‌కు రైతుల ఫిర్యాదు
రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామ శివారులో ఉన్న చీమల చెరువుకు సంబంధించిన తూములు కొల్లగొట్టి కొందరు వ్యక్తులు అక్రమంగా చెరువు నీటిని వదులుతున్నారని ఆరోపిస్తూ గ్రామ రైతులు తహసీల్దార్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు.
Kalvacherla | రామగిరి, మే 11 : రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామ శివారులో ఉన్న చీమల చెరువుకు సంబంధించిన తూములు కొల్లగొట్టి కొందరు వ్యక్తులు అక్రమంగా చెరువు నీటిని వదులుతున్నారని ఆరోపిస్తూ గ్రామ రైతులు తహసీల్దార్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. చెరువులో నిల్వ ఉన్న నీటిని అనధికారికంగా బయటకు వదలడం వల్ల గ్రామ పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు తీవ్రంగా పడిపోతాయని, వేసవి కాలంలో పశు పక్షాదులకు తీవ్ర నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
చెరువులో ప్రస్తుతం ఉన్న నీరు గ్రామ రైతులకు, పశువులకు ఎంతో ఉపయోగకరమని, ఇటువంటి పరిస్థితుల్లో కొందరు వ్యక్తులు స్వప్రయోజనాల కోసం తూములు ధ్వంసం చేసి నీటిని వృథాగా వదులుతున్నారని వారు ఆరోపించారు. వెంటనే సంబంధిత అధికారులను పరిశీలించి, చెరువు తూములు ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. అదేవిధంగా చెరువుకు రక్షణ చర్యలు చేపట్టి, మిగిలిన నీటిని సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను కోరారు. గ్రామ ప్రజల జీవనాధారమైన చెరువులను కాపాడేందుకు అధికారులు తక్షణమే స్పందించాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

