Farmers, agree | రామగిరి మే 13: తమ గ్రామ శివారు లో ప్రభుత్వం తలపెట్టిన ఇండస్ట్రియల్ కారిడారు ఏర్పాటు కు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మంగళవారం హైదరాబాద్ లోని సచివాలయంలో రత్నాపూర్ గ్రామానికి సంబంధించిన రైతులు మంత్రి శ్రీధర్ బాబు ను కలిసి తమ గ్రామం లో నిర్మిస్తున్న ఇండస్ట్రియల్ కారిడార్ నెలకొలపాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారని కోక కోలా కంపెని ఈ ప్రాంతంలో నేలకొల్పడం ద్వారా నిరుద్యోగులైన యువతకు ఈ ప్రాంతంలోనే మెరుగైన ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి వారికి తెలియజేశారు.
భూమి కోల్పోయిన ప్రతి రైతు కుటుంబానికి సరియైన నష్టపరిహారం, రత్నాపూర్ ప్రజలకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా రత్నాపూర్ గ్రామ రామగిరి మండల మహిళాలకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా ప్రముఖ కుట్టు మిషన్ సంస్థ అయిన ఉషా కంపెనీ వారిచే మహిళలకు ట్రైనింగ్ ఏర్పాటు చేయించి రాబోవు రోజులలో ఇక్కడే వస్త్ర పరిశ్రమలకు సంబంధించిన ఎంవోయూ అయ్యేలా చేయించి మహిళ మాతలకు ఆర్థిక స్వేచ్ఛను కల్పించడంలో ముందుండి ఈ ప్రాంతానికి డెవలప్ చేస్తానని మంత్రి గంట పదంగా వారికి చెప్పారని తెలిసింది.
రత్నాపుర్ రైతులు స్వచ్ఛందంగా తమ భూమిని అభివృద్ధి కోసం ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు మంత్రి శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్ బాబు ను కలిసిన వారిలో రైతులు కొండ్రు అంజన్న కొడాలి సది, ధర్ముల వెంకటేష్, కండె పోషం, కెక్కర్ల శ్రీనివాస్ దాసరి రామచందర్, తొట్ల రాయమల్లు యాదవ్, కండె గట్టయ్య, మన్నాల రవీందర్, మన్నాల రాజు, దాసరి సురేష్, గొర్రె కొమురయ్య యాదవ్, బెజ్జాల లక్ష్మణ్, బెజ్జాల రాజేష్, అంగూరి నారాయణ, బెజ్జాల సదానందం, మన్నల లాలు, మన్నల శ్రీనివాస్, సాయి సంజయ్ వర్మ, రావికంటి అరవింద్, పలువురు గ్రామ నాయకులు తదితరులు ఉన్నారు.