UREA | సైదాపూర్ : సైదాపూర్ మండలకేంద్రంలో యూరియా కోసం బుధవారం రైతులు ఆందోళన చేపట్టారు. పలు గ్రామాలకు చెందిన రైతులు యూరియా కోసం ఉదయమే సింగిల్ విండో కార్యాలయం వద్దకు ఉదయమే వచ్చి సొసైటీ గోదాం ముందు చెప్పులతో క్యూ పెట్టారు. మధ్యాహ్నం వరకు రైతులు వేచి చూశారు.
కొంత మంది రైతులలు ఉదయం టిఫిన్ బాక్స్ లతో వచ్చి సొసైటీ వద్దనే అన్నం తిన్నారు. మధ్యాహ్నమైనా యూరియా రాకపోవడం తో విసిగి పోయిన రైతులు సహకార సంఘం గోదాం ఎదుట ప్రధాన రహదారి పై ధర్నా రాస్తారోకో చేశారు. తమకు యూరియా వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.
సైదాపూర్ ఎస్సై తిరుపతి ధర్నా వద్దకు చేరుకొని రైతులతో మాట్లాడి శాంతింపజేశారు. పొద్దంతా ఉన్నా యూరియా డోరకడం లేదని రైతులను ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రభుత్వంపై మండిపడ్డారు.