Farmer registry | సుల్తానాబాద్ రూరల్, జూలై 3 : ఫార్మర్ రిజిస్ట్ చేసుకోవాలని ఏఈవో రవితేజ అన్నారు. ఈ సందర్భంగా ఏఈవో రవితేజ మాట్లాడుతూ.. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని రేగడి మద్దకుంట క్లస్టర్ పరిధిలోని అల్లిపూర్ , మియాపూర్, చిన్న బొంకూర్ ,రేగడి మద్దికుంట గ్రామంలో గురువారం రుణమాఫీ లబ్ధిదారుల వివరాలు వెల్లడించారు.
వానాకాలం రైతు రుణమాఫీ అయిన లబ్ధిదారుల వివరాలతో కూడిన ప్లెక్సీలు, ప్రాథమిక వ్యవసాయ కార్యాలయం ఆవరణ, గ్రామపంచాయతీ కార్యాలయం, ప్రధాన కూడలిలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ప్రచురణ నిమిత్తం పెట్టడం జరిగిందన్నారు.
ఇంకా ఫార్మర్ రిజిస్ట్రీ లో తమ పేర్లను నమోదు చేసుకొని రైతులు నమోదు చేసుకోవాలని రైతులకు సూచించారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీనే కీలకమని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఏఈవో రవితేజ అన్నారు.