పెద్దపల్లి, జూలై 7: ‘తెల్లారితే బతుకుదెరువు ఉండనోళ్లు. పైరవీకారులు, రాజకీయ బ్రోకర్లు మాత్రమే పార్టీ మారుతున్నారు తప్ప, నికార్సయిన కార్యకర్తలు, నాయకులు పార్టీ మారడం లేదు. కొంత మంది పో యినంత మాత్రాన బీఆర్ఎస్కు నష్టం లేదు. వాళ్లతో అయ్యేది లేదు.. పోయేది లేదు. ఉద్యమ టైంలో మ నం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాం. కలబడి నిలబడి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నాం. పదేళ్లు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటు పడింది మ న బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు తాత్కాలిక బ్రేక్ పడింది. భవిష్యత్ మనదే. మళ్లీ బీఆర్ఎస్ వస్తుందని, ఉప్సెనలా వస్తామని’ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నా రు.
ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో పెద్దపల్లి నియోజకవర్గంలో ఇటీవల పదవీకాలం పూర్తయిన బీఆర్ఎస్ ఎంపీపీలు, వైస్ ఎంపీపీ లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మార్కెట్ చైర్మన్లకు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి దాసరి మనోహర్‌రెడ్డి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. దీనికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి మాజీ మంత్రి హాజరై, మాట్లాడారు.
ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సేవ చే స్తే ప్రజలే మళ్లీ మనకు పట్టం గడుతారన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పదేళ్ల పాలన స్వర్ణయుగమ ని కొనియాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ని త్యం జనంలోనే ఉండాలని, కాంగ్రెస్ నాయకుల, ప్ర భుత్వ తప్పులను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని పి లుపునిచ్చారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీ హరి అధికార దాహంతో పార్టీ మా రారని, అలాంటి వారిని ప్రజలు సైలెంట్‌గా గమనిస్తున్నారని, సమ యం వచ్చినప్పుడు బుద్ది చెప్పుతారని పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సిం గ్, తాజా మాజీ ఎంపీపీలు బండారి స్రవంతి శ్రీనివాస్, నూనేటి సంపత్, బాలాజీరావు, తానిపర్తి స్ర వంతి మొహన్ రావు, రమాదేవి రామ్‌గోపాల్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ రాములు, బీఆర్ఎస్ పట్టణాధ్యాక్షు డు రాజ్‌కుమార్, నాయకులు లక్ష్మణ్, దాసరి ఉష, రాములు, అంజయ్య, సతీష్, వాసు ఉన్నారు.
నేను ఓ సామాన్య కార్యకర్తగా ఈశ్వర్ అన్న సమక్షంలో ఆనాడు బీఆర్ఎస్లో చేరా. ఉద్యమంలో చురుగ్గా పని చేశా. రామగుండం ఎమ్మెల్యేగా నన్ను అదృష్టం వరించింది. అధికా రం, పదవు లు శాశ్వతం కాదు. నిబద్దత ప్రజాసేవ చేయడం ద్వారా వచ్చే గుర్తింపే శాశ్వతం. ప్రజాప్రతినిధిగా గెలుపోందడమే గొప్ప అదృష్టం. అలాంటి అవకాశాన్ని కేసీఆర్ కల్పించారు. అలవికానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ తిప్పికొట్టాలి. అలాంటప్పుడే మళ్లీ మనం ప్రజా ప్రతినిధిగా ఎన్నుకోబడుతాం.
– కోరుకంటి చందర్, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు
రెండు పర్యాయాలు పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయా లి. బీఆర్ఎస్ మనకు ప్రజా ప్రతినిధిగా గుర్తింపునిచ్చింది. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటూ చివరి రక్తపు బొట్టు వరకు పార్టీ పటిష్టత కోసం పని చేయాలి. పార్టీ మారితే ఉన్న విలువ పోగొట్టుకునుడే తప్ప ఏమీ ఉండదు. ప్రజా ప్రతినిధిగా ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉంటాం. వాటిని సవరించుకోని ప్రజలతో మమేకమై సమాజ హితం కోసం పని చేయాలి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసే దాకా బీఆర్ఎస్ శ్రేణులు రాజీలేని పోరాటం చేయాలి.
– దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి