వెల్గటూర్, ఫిబ్రవరి 10 : ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసకారి మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. వెల్గటూర్ మండలం స్తంభంపల్లిలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో హామీలను అమలు చేస్తానని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు మాయ మాటలు చెబుతున్నదని, 420 హామీలు ఇచ్చి ప్రజలను వంచించి మోసం చేసిందని విమర్శించారు.
‘రైతు భరోసా లేదు, పింఛన్ పెంచలేదు, కల్యాణలక్ష్మి పథకానికి తులం బంగా రం ఇవ్వడం లేదు, దివ్యాంగులకు 6 వేల పింఛ న్ రావడం లేదు, దళితబంధు లేదు’ అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్తంభంపల్లికి వ్యవసాయ కళాశాల మంజూరు చేశామని, ఇప్పుడు ఎందుకు పనులు చేయడం లేదని ప్ర శ్నించారు. కోటిలింగాల ఆలయ అభివృద్ధికి 2.50 కోట్లు మంజూరు చేశామని, పనులు ఎక్కడివక్కడే ఎందుకు నిలిచి పోయాయని మండిపడ్డారు. టూరిస్టుల సౌకర్యం కోసం నిర్మించినన హరిత హోటల్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారని నిలదీశారు.
ఈ ప్రాంత అభివృద్ధి కోసం వచ్చిన పనులను పూర్తి కోసం స్థానిక ఎమ్మెల్యేను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారులు, పోలీసులు అధికార పార్టీ నాయకుల కనుసైగల్లో పని చేస్తున్నారని, ఇది మంచి పరిణామం కాదన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ పరంగా కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అంతకు ముందు మండలంలోని పలు శుభకార్యాలకు హాజరయ్యారు.
కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు రాంచందర్‌గౌడ్, సీనియర్ నాయకులు ఎలేటి కృష్ణారెడ్డి, పత్తిపాక వెంకటేశ్, మూగల సత్యం, ముల్కల్ల గంగారం, జుపాక కుమార్, పోడేటి రవి, బిడారి తిరుపతి, రంగు తిరుపతి, బందెల నర్సయ్య, బందెల రాజ య్య, గుంగ జగదీశ్వర్ గౌడ్, ఎర్రోళ్ల మహేశ్, కటుకం రమేశ్, ఎర్రం పోచమల్లు ఉన్నారు.