korutla | ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి
పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని లయన్స్ క్లబ్ పట్టణ అధ్యక్షుడు కొమ్ముల జీవన్ రెడ్డి పేర్కొన్నారు. క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని పట్టణంలోని ఆదర్శనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, పలకలు తదితర సామగ్రిని శుక్రవారం ఉచితంగా పంపిణీ చేశారు.
korutla | కోరుట్ల, జూలై 4: పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని లయన్స్ క్లబ్ పట్టణ అధ్యక్షుడు కొమ్ముల జీవన్ రెడ్డి పేర్కొన్నారు. క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని పట్టణంలోని ఆదర్శనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, పలకలు తదితర సామగ్రిని శుక్రవారం ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జాతీయ రహదారి పక్కన మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి ఏలేటి లక్ష్మారెడ్డి, కోశాధికారి నల్ల గంగాధర్, లయన్స్ ఆర్సీలు గుంటుక సురేష్ బాబు, అజయేందర్ రావు, ఆడేపు మధు, మంచాల జగన్, వనపర్తి చంద్రమోహన్, గుంటుక మహేష్, గుణాకర్ రెడ్డి, పడాల నారాయణ గౌడ్, గాజంగి నాగ భూషణ్, వెంకట్రాములు, కల్లెం గంగారెడ్డి, బెజ్జంకి శ్రీనివాస్ రావు, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
వనమహోత్సవాన్ని విజయవతం చేయాలి
పెగడపల్లి : వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెగడపల్లి సహకార సంఘం చైర్మన్ ఓరుగంటి రమణారావు పిలుపునిచ్చారు. జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఏక్ పెడ్ మా కే నామ్ ‘ ( మన తల్లి పేరిట ఒక మొక్క నాటుదాం) కార్యక్రమాన్ని పెగడపల్లి ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో నిర్వహించారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 ను పురస్కరించుకొని సహకార సంఘ పరిధిలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. సహకార సంఘం చైర్మన్ రమణారావు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని ఆయన కోరారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. సహకార సంఘ పరిధి లో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డి, పీఏసీఎస్ కార్యదర్శి గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ సత్తయ్య, నాయకులు రాజేశ్వరరావు, శ్రీనివాస్, కనకయ్య, లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

