గన్నేరువరం, ఆగస్ట్14 : ఈనెల 21న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే మహా పాదయాత్రను విజయవంతం చేయాలని మాజీ జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎన్నికల ప్రచారంలో తాను ఎమ్మెల్యే గా గెలిచిన ఆరు నెలల్లో డబుల్ రోడ్డు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారని, కానీ మూడు సంవత్సరాలు కావస్తున్న తట్టెడు మట్టి తీయలేదని ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే డబుల్ రోడ్డు కోసం 72 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. డబుల్ రోడ్డు కోసం నాడు నానా హంగామా చేసిన యువజన సంఘాలు నేడు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. గుంతల రోడ్డుపై ప్రజలు నానా అవస్థలు అధికార పక్షానికి చీమ కుట్టినట్టైనా లేదన్నారు. మండల కేంద్రం గన్నేరువరం నుండి గుండ్లపల్లి ఎక్స్ రోడ్ వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు.ఈ పాదయాత్రలోఈ పాదయాత్రలో మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తోపాటు పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొంటారన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.