Blood donate | హుజురాబాద్ రూరల్, అక్టోబర్ 30 : ప్రతీ ఒక్కరూ రక్తదానం చేయాని హుజురాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. పోలీసుల అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా హుజూరాబాద్ క్లబ్ లో ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. సబ్ డివిజన్ లోని సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, యువకులు రక్తదానం చేయగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సిబ్బంది రక్తాన్ని సేకరించారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ రక్తదానం మహాదానం అని అన్నారు. ఆపదలో ఉన్న పేషంట్లను ఆదుకున్నవారమవుతామని చెప్పారు. రక్తదానం చేసిన వారు అమరులైన పోలీసులకు నిజమైన నివాళులు అర్పించినట్లే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ డిజన్ సీఐలు కరుణాకర్, వెంకట్ గౌడ్, లక్ష్మీనారాయణ, రామకృష్ణ, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, యువకులు తదితరులు పాల్గొన్నారు.