Sardar Sarvai Papanna | చిగురుమామిడి, ఆగస్టు 18 : మొగల్ సామ్రాజ్య విస్తరణ ఎదిరించి బహుజన రాజ్య స్థాపన కోసం పోరాడిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాల కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ కొత్త వినీత, ఎస్ఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి తిరుపతి అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో సర్వాయి పాపన్న జయంతి పురస్కరించుకొని మంగళవారం విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో జన్మించి బహుజన హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం పోరాటాలు చేశాడని కొనియాడారు. ప్రతీ మండల కేంద్రంలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆకవరం భవాని, బీఆర్ఎస్ నాయకులు సాంబారి కొమురయ్య, మాజీ జడ్పీటీసీ గీకురు రవీందర్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మార్క రాజ్ కుమార్, వివిధ పార్టీల నాయకులు చిట్టిమల్ల రవీందర్, అందే సురేష్, బండారుపల్లి చంద్రం, పూదరి వేణు, బుర్ర శ్రీనివాస్, పోటు మల్లారెడ్డి, బొమ్మగాని పరశురాములు, తాళ్లపల్లి రాములు, బుర్ర సదానందం, దొంత కర్ణాకర్, దోమ శ్రీనివాస్ రెడ్డి వివిధ కుల సంఘాల నాయకులు, పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు.
కాల్వశ్రీరాంపూర్ మండలంలో..
కాల్వ శ్రీరాంపూర్ ఆగస్టు 18 : కాల్వ శ్రీరాంపూర్ లో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఆ సంఘం మండల అధ్యక్షుడు వీరగోని రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సర్వాయి పాపన్న బహుజన సమాన త్వానికి, ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక అని కొనియాడారు. మొఘల్ సామ్రాజ్య అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి, సామాన్య ప్రజలను ఏకం చేసి కోటలు నిర్మించిన ధీశాలి పాపన్న అని పేర్కొన్నారు. బహుజనులకు అధికారం, సామాజిక హక్కులు సాధించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు. ఈ కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో వచ్చే సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల వరకు విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, సర్పంచులు బంగారు రమేష్, గాజనమైన స్వరూప సదయ్య, మాజీ ఎంపీపీలు గోపగోని సారయ్య గౌడ్, నునేటి సంపత్, మాజీ జడ్పీసీలు వంగల తిరుపతిరెడ్డి, లంక సదయ్య, సర్పంచులు, గౌడ సంఘం నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.