Thimmapur | తిమ్మాపూర్, నవంబర్ 5: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతులు అల్లకల్లోలం అవుతున్నారు. వాన తగ్గినప్పటికీ పొలంలో నీళ్లు వరద తగ్గకపోవడంతో పొలాలన్నీ వరదలో మగ్గిపోతున్నాయి. మరో ఒకటి రెండు రోజులు ఇలానే ఉంటే చేతికి వచ్చిన పంట వరి గొలుసు ముక్కిపోయే పరిస్థితి ఉన్నది. తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో పరిస్థితి గోరంగా మారింది.
పర్లపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు మూడున్నర ఎకరాల్లో వరి సాగు చేయగా సోమవారం, మంగళవారం కురిసిన వర్షానికి వచ్చిన వరద పొలం నుండి వెళ్లిపోకపోవడంతో రైతుకు కన్నీళ్లే మిగిల్చుతున్నాయి. మరో వారం రోజుల్లో కోతకు వచ్చిన పొలం నీళ్ల పాలవడంతో రైతు కన్నీరు మున్నీరవుతున్నారు. వేల పెట్టుబడి పెట్టి నీళ్ల పాలవడంతో రైతుల బాధ వర్ణనాతీతంగా ఉన్నది. సీపీఐ మండల కార్యదర్శి బోయిని తిరుపతి వరద పొలాలను సందర్శించి నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50వేల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.