గంభీరావుపేట, డిసెంబర్ 8: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ గ్రామాలకు ప్రచారానికి రాకున్న భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు పేర్కొన్నారు. మండలంలోని శ్రీగాధలో గురువారం గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పర్ష హన్మాండ్లు హాజరై మాట్లాడారు. మంత్రి కేటీఆర్‌పై నమ్మకంతో ప్రపంచంలోనే పేరు గాంచిన పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇతర పరిశ్రమలు రూ.కోట్లాది పెట్టుబడులతో రావడంతో రాష్ట్రంలో లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయన్నారు.
సిరిసిల్ల నియోజక వర్గాన్ని ప్రపంచ చిత్ర పటంలో నిలబెట్టినందుకు ఇక్కడి ప్రాంత ప్రజలు గర్వపడుతున్నారని పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా రూపురేఖలు మార్చిన మంత్రి కేటీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. సిరిసిల్ల జిల్లాతో పాటు కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల ప్రజల చిరకాల కోరిక అంతర్ జిల్లా శ్రీగాధ వంతెనను రూ.13 కోట్లతో నిర్మించిన కేటీఆర్ వెంటే ప్రజలుంటారని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ సహకారంతో గ్రామంలో అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ సర్పంచ్ కత్తుల బాబు, ఎంపీటీసీ పర్ష స్నేహలత, ఉప సర్పంచ్ కాశి, టీఆర్ఎస్ నేతలు కల్వకుంట్ల లక్ష్మణ్‌రావు, కల్వకుంట్ల రంగారావు, పర్ష శ్రీనివాస్, గోపాల్‌రావు, నర్సింగరావు, మోహన్‌రావు, పర్ష శ్రీనివాస్, లక్ష్మణ్‌రావు, స్టీఫెన్, బాల్‌రాజు, భిక్షపతి, యాదాగౌడ్, సంజయ్య, శ్రీనివాస్‌గౌడ్, కాశాగౌడ్, రమేశ్ ఉన్నారు.