JEE Result | తిమ్మాపూర్,ఏప్రిల్19: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలలో ఎస్సార్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభ చూపారు. కరీంనగర్ జిల్లాలోని ఎస్ ఆర్ విద్యా సంస్థలకు చెందిన 185 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో అర్హత సాధించి జాతీయస్థాయిలో సత్తా చాటారు. అత్యుత్తమ ప్రతిభ చూపిన భరణి శంకర్, సురేష్, కార్తీక్, మాధవ్ చరణ్, రామ్ చరణ్, నాగపురి రోహిత, పొన్నాల లహరి, కొల్లూరి హాసిని, రిషిశ్వర్ రెడ్డి, సాయి చందన, శ్రీ చరణ్ జోషి, గోవిందారపు శివ సాయిలను తిమ్మాపూర్ మండలం అలుగునూర్ లోని ఎస్సార్ కాలేజీలో జోనల్ ఇంచార్జ్ తిరుపతి అభినందించారు.
పుష్పగుచ్చం అందజేసి స్వీట్లు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయస్థాయిలో తమ విద్యార్థులు అర్హత సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. విజయం సాధించడంలో తమ యజమాన్యం అందించిన ప్రోత్సాహాన్ని గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తామని ఆశభావం వ్యక్తం చేశారు. అధ్యాపకులు అందించిన కృషితోనే తాము అర్హత సాధించినట్లు విద్యార్థులు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.