Lok Adalath | సుల్తానాబాద్ రూరల్, జూన్ 14:రాజీ మార్గమే రాజ మార్గం అని, లోక్ అదాలత్ లతో ఇరువర్గాలకు సమ న్యాయం అందుతుందని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ అన్నారు. జాతీయ లోక్ అదాలత్ ను పురస్కరించుకుని మండల న్యాయసేవాదికార సంస్థ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిఫ్ కోర్టు అవరణలో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జడ్జి గణేష్ మాట్లాడుతూ లోక్ అదాలత్ లో కక్షిదారులకు సత్వర న్యాయం జరుగుతుందని, రాజీ మార్గంతో కేసులు పరిష్కరించుకోవచ్చనీ, తద్వారా ఇరువర్గాలకు సమ న్యాయం అందుతుందని అన్నారు. క్షణికావేశంలో చేసిన నేరాల వల్ల భవిష్యత్తు కోల్పోతారని, వ్యయ్య ప్రయాసలకు గురికాకుండా ఉండేందుకు లోక్ అదాలత్ లలో కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ లో పలు క్రిమినల్, చెక్ బౌన్స్, కుటుంబ తగాదాలు, సివిల్ కేసులకు సంబంధించిన 467 కేసులు పరిష్కరించినట్లు కోర్టు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి భోయిని భూమయ్య, ఏజీపి దూడం ఆంజనేయులు, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నేరెళ్ల శంకరయ్య, లోక్ అదాలత్ సభ్యులు మాడూరి ఆంజనేయులు, చీకటి సంతోష్ కుమార్, న్యాయవాదులు పబ్బతి లక్ష్మీకాంత రెడ్డి, ఆవుల లక్ష్మి రాజం, వొడ్నాల రవీందర్, ఆవునూరి సత్యనారాయణ, జోగుల రమేష్ లతో పాటు పలువురు న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.