Environmental | కోనరావుపేట, జూలై 11: పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని జిల్లా ఎస్పీ మహేష్ బీ గితే అన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా డీఎఫ్వో బాలమణి, విద్యార్థులు,అధికారులతో కలసి శుక్రవారం మొక్కలు నాటారు.
ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చెట్లను మానవాళి అవసరాల కోసం నరికివేయడం అందుకు అనుగుణంగా మొక్కల పెంపకం చేపట్టకపోవడం కారణంగా ప్రస్తుత పరిస్థితులు ఏర్పడుతున్నాయని అందువల్ల విధిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
మొక్కలు మానవ జీవ కోటికి ప్రాణధారమని భూభాగములో జీవ కోటికి అత్యంత అవసరైమన వాటిలో మొక్కలు ప్రధానమైనవనీ ప్రతీ ఒక్కరూ తమ వంతు భాద్యతగా నాటిన మొక్కలను ఖచ్చితంగా రక్షించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంట సీఐ వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, ఫారెస్ట్ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.