Kalvasrirampur | పెన్షన్ విద్రోహదినం సందర్భంగా నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన
పెన్షన్ విద్రోహ దినోత్సవం సందర్భంగా మండల పరిషత్, రేవెన్యూ ఉద్యోగులు భోజన విరామ సమయంలో తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం ముందు మంగళవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.
Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, సెప్టెంబర్ 1 : పెన్షన్ విద్రోహ దినోత్సవం సందర్భంగా మండల పరిషత్, రేవెన్యూ ఉద్యోగులు భోజన విరామ సమయంలో తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం ముందు మంగళవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు, తహసీల్దార్ రాపెల్లి రాముడు, తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు రంగు రవి మాట్లాడారు. సీపీఎస్ రద్దుచేసి, ఓపీఎస్ పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏ లను వెంటనే విడుదల చేయాలని, పీఆర్సీ తక్షణమే అమలు చేయాలని, వివిద కారణాలతో నిలిచిపోయిన ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగుల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకొని, ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు ఐక్యంగా ప్రజాస్వామ్య పద్దతిలో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సురేందర్‌కుమార్, ఆర్ఏలు వినోద్, రాజేశ్, జీపీవోలు, ఎంపీస్వో శ్రీవాణి, ఉద్యోగులు యాసిన్, మహేందర్, సందీప్, శ్రీధర్, భాగ్యలక్ష్మి, రమ్య, కిరణ్, రమ, శ్రీకాంత్, సంపత్, శ్రీనివాస్, అశోక్, సతీశ్, సునీల్, మంజుల, షాబోద్దీన్, తాజ్, తిరుమల తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

