Electricity | పెద్దపల్లిరూరల్, మే 3 : విద్యుత్ వినియోగంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఆధునిక పరిజ్ఞానపు మెలుకువలను పాటిస్తూ విద్యుత్ ప్రమాద రహిత జిల్లాగా పెద్దపల్లికి పేరు ప్రతిష్టలతో రికార్డుకెక్కించాలని పెద్దపల్లి ఎన్ పీడీసీఎల్ ఎస్ఈ కంకటి మాధవరావు అన్నారు. మండలంలోని రాఘవాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ లో ఎన్ పీడీసీఎల్ భవన సముదాయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విద్యుత్ అధికారుల సమావేశంలో మే1నుంచి 7వరకు వారం పాటు జరిగే విద్యుత్ భద్రతా వారోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన సమావేశంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది వినియోగదారుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలు ముందు జాగ్రత్తలను వివరించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి సర్కిల్ డివిజన్ కు చెందిన అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.