Field trip | పెగడపల్లి: పెగడపల్లి మండలం నర్సింహునిపేటలో శుక్రవారం విద్యుత్ అదికారులు పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెగడపల్లి విద్యుత్ ఏఈ వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా రైతులు జాగ్రత్తగా ఉండాలని, ఐరన్ స్టాటర్ బాక్సులు తొలగించి, ఫైబర్ బాక్స్ లు పెట్టు కోవడంతో పాటు, నాణ్యమైన ఫీజులు, వైర్లు, కెపాసిటర్లు, ఐఎస్ఐ మోటర్లు, పైపులు వినియోగించాలని, వర్షాలు పడే సమయంలో విద్యుత్ మోటర్లు ఆన్ చేయకుండా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ సబ్ ఇంజనీర్ అజయ్, సిబ్బంది రాజేందర్, వెంకటేశం, శేఖర్ రెడ్డి, మునిరాజ్ గ్రామ రైతులు ఉన్నారు.