Sultanabad | సుల్తానాబాద్ రూరల్ మే 1: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ లోని విద్యుత్ కార్మికులు కాంపెల్లి సుధాకర్ లైన్ ఇన్స్పెక్టర్, కొంగుల లక్ష్మణ్ లైన్మెన్, కొలడినేష్ అసిస్టెంట్ లైన్మెన్, ఒడ్నాల రమేష్, నాంపల్లి సదానందంను గురువారం మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ సన్మానించి బహుమతి అందజేశారు. విద్యుత్ కార్మికులు ఉండే ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ ను మిట్టపల్లి ప్రవీణ్ సందర్శించారు.
అక్కడి రేకుల షెడ్ లోని వేడిని చూసి వెంటనే సీలింగ్ ఫ్యాన్ ఫిట్ చేయించినారు. ఈ సందర్భంగా మిట్టపల్లి ప్రవీణ్ మాట్లాడుతూ ఆక్సిజన్ తర్వాత విద్యుత్ అతిముఖ్యమైనదని, విద్యుత్ నిరంతరాయ సరఫరాలో పనిచేస్తున్నవారికి మెరుగైన సదుపాయాలు కల్పించాలని, శ్రమదోపిడీకి గురికాకుండచూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, సర్వర్ పాషా పాల్గొన్నారు.