Electrical accident | మంథని, డిసెంబర్ 27: స్థానిక ఆర్టీసీ డిపోలోని స్టోర్ రూంలో షార్ట్సర్క్యట్తో ప్రమాదం వాటిల్లింది. శుక్రవారం రాత్రి సమయంలో డిపోలోని స్టోర్ రూంలో జరిగిన ప్రమాదంతో మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న ఆర్టీసీ సిబ్బంది అప్రమత్తమై ఫైర్ సేఫ్టీ ద్వారా మంటలను ఆర్పివేశారు.
దీంతో పాటు ఫైర్ స్టేషన్‌కు సైతం సమాచారం ఇవ్వడంతో వారుసైతం మంటలు చెలరేగకుండా వాటిని పూర్తి ఆర్పివేశారు. స్టోర్ రూంలో మంటలు చెలరేగడంతో పాత ఫైళ్లు కాలి పోయాయని, ఎలాంటి నష్టం జరగలేదని డిపో మేనేజర్ శ్రవణ్‌కుమార్ తెలిపారు.