జనావాసాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు భయపెడుతున్నాయి. ఎత్తులో బిగించాల్సిన వాటిని.. నేలపై, గజం ఎత్తులో కంచె లేకుండా ఏర్పాటు చేయడంతో కరీంనగర్లో డేంజర్‌గా మారాయి. రద్దీ ఉండే ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు ఉండడం, వానలు పడుతుండడం, సమీపం నుంచే రాకపోకలు సాగిస్తుండడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతుండగా, ఏమైనా జరిగితేనే అధికారులు పట్టించుకుంటారా..? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ముకరంపుర, ఆగస్టు 7 : వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కృషి చేస్తున్నామని చెప్పారు. కరీంనగర్ సరిల్ కార్యాలయంలోని మీటర్ టెస్టింగ్ (ఎమ్మార్టీ) డివిజన్ ఎల్టీ మీటర్ టెస్టింగ్ ల్యాబ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సెమీ ఆటోమేటిక్ టెస్ట్ బెంచ్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆవరణలో మొకలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. కొత్తగా ప్రారంభించిన ల్యాబ్‌లో అత్యంత కచ్చితత్వంతో అన్ని రకాల మీటర్లను పరీక్షించవచ్చని, ఒకేసారి 20 మీటర్లకు వివిధ రకాల పరీక్షలు చేయవచ్చని చెప్పారు. హై రేంజ్ కరెంట్ వివిధ పవర్ ఫ్యాక్టర్లతో పరీక్ష చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈ వీ గంగాధర్, డీఈ (టెక్నికల్) పీ విజేందర్ రెడ్డి, ఎమ్మార్టీ డీఈ కాళిదాసు, ఈఈ(సివిల్) శ్రీనివాస్, ఏడీఈ పంజాల శ్రీనివాస్ గౌడ్ తదితరలు పాల్గొన్నారు.