Karimnagar | కరీంనగర్, తెలంగాణ చౌక్ : ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న ఎలక్ట్రికల్ బస్సులను రద్దు చేసి ఆర్టీసీ ఆధ్వర్యంలో నడపాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల రమేష్ డిమాండ్ చేశారు. ఎలక్ట్రికల్ బస్ లను ప్రైవేట్ సంస్థలకు అప్పించడాన్ని నిరసిస్తూ బస్టాండ్ ఆవరణలోని డిపో-2 ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంవీ యాక్ట్-2019, ఎలక్ట్రికల్ బస్సుల విధానం వల్ల ఆర్టీసీ తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటుదన్నారు.
ఎలక్ట్రికల్ బస్సుల వల్ల ఆర్టీసీలో ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు మాత్రమే ఆర్టీసీలో మిగులుతాయన్నారు. ఎలక్ట్రికల్ బస్సులో కొనుగోలు నిర్వహణ ఆపరేషన్ అన్ని ఆర్టీసీనే నడిపించేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రికల్ బస్సులతో ఆర్టీసీకి ప్రతీ రోజుకు ప్రజలపై రూ.50 లక్షల భారం పడుతున్నారు. భవిష్యత్లో మరింత భారం పెరుగుటుందని తెలిపారు. ఎలక్ట్రికల్ బస్సులకు విద్యుత్ సబ్ స్టేషన్లు మౌలిక వసతులు కల్పన పేరుతో ఆర్టీసీ డిపోలను విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు అప్పగించారని ఆరోపించారు. ఎలక్ట్రికల్ బస్సుల ప్రవేశం వల్ల డ్రైవర్లు మెకానికులు ఉద్యోగులు ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు.
ఆర్టీసీ ఆదాయం పెరిగిన ఎలక్ట్రికల్ బస్సులకు అధిక చెల్లింపులతో ఆర్టీసీ నష్టాల్లోకి వెళుతుందన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వ ఈవీ బస్సుల విధానంలో మార్పు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు యూ శ్రీనివాస్, కోశాధికారి జీ రాజేశం సహాయ కార్యదర్శులు పున్నం రవి, కొప్పుల శంకర్, నగర కన్వీనర్ పుల్లెల మల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు పిల్లి రవి, వల్లూరి కిషోర్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.