Collector Satya Prasad | కోరుట్ల, జనవరి 28: కోరుట్ల మున్సిపాలిటీలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరుగుతోందా లేదా అనే విషయాన్ని స్వయంగా తనిఖీ చేశారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
అన్ని నామినేషన్ కేంద్రాల వద్ద అన్నిరకాల ఫామ్స్ అందుబాటులో ఉండేల చూసుకోవాలని, ప్రతీ నామినేషన్ కేంద్రం వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, శాంతియుత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీఓ జివాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీందర్, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.