Election of new committee | ధర్మారం,సెప్టెంబర్ 21: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు పద్మశాలి సంఘం నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు . ఈ మేరకు గ్రామంలోని కుల సభ్యులంతా స్థానిక సంఘ భవనంలో ప్రత్యేకంగా సమావేశమై కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సంఘం గౌరవ అధ్యక్షుడిగా గాలిపెల్లి భూమయ్య , అధ్యక్షుడి గా అయిట్ల చంద్రయ్య, ఉపాధ్యక్షుడిగా కోడూరి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శిగా గోనె రాజయ్య, కోశాధికారిగా బత్తుల వెంకటేశం ఎన్నికయ్యారు.