Veenavanka | వీణవంక, అక్టోబర్ 18: వీణవంక మండల పంచాయతీ కార్యదర్శుల నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. మండలాధ్యక్షుడిగా కె.అంజయ్య (వల్భాపూర్), ప్రధానకార్యదర్శిగా బి.రవి (ఇప్పలపల్లి), గౌరవాధ్యక్షుడిగా ఆర్.కిషన్, ఉపాధ్యక్షులుగా ఎ.యశోద, ఆర్.హరీష్, సంయుక్త కార్యదర్శులుగా కె.ఐలోని, పి.సుష్మ, కోశాధికారిగా ఎల్. కృష్ణను ఎన్నుకున్నారు.
ఈసీ మెంబర్లుగా పి.సందీప్, జి.స్వప్న, కె.రజిత, ఎం.రాజు, ఎం.శరత్, బి.నరేష్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు కె.అంజయ్య మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి, సంఘం బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన తోటి పంచాయతీ కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలియజేశారు.