Heart attack | మల్లాపూర్, జూలై 14: మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన చిట్యాల రెడ్డి (70) అనే వృద్ధుడు చేపల వేటకు వెళ్లి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం.. రెడ్డి వృత్తిరీత్యా చేపలు పడుతూ జీవనం కోనసాగిస్తున్నాడు.
ఈ క్రమంలో గ్రామశివారులోని చెరువు వద్దకు చేపలు పట్టేందుకు వెళ్లగా, అక్కడే ఒక్కసారిగా గుండె పోటు వచ్చి తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గ మధ్యలో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య రాజగంగు, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.