counseling | జగిత్యాల, ఆగస్టు3 : కౌన్సిలింగ్ తో వృద్ధుల కేసులు పరిష్కారం.. తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ అన్నారు. తల్లిదండ్రులను పోషించక నిరాధరిస్తున్న కుమారులు, కోడళ్లకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు గౌరిశెట్టి విశ్వనాథం, వెల్ముల ప్రకాష్ రావు, పీసీ హన్మంత రెడ్డి, ప్రభాకర్ రావు, రాధ తదితరులు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. దీంతో తాము తమ తల్లిదండ్రులను పోషిస్తూ, బాగోగులుచేసుకోవడానికి సమ్మతించి ఒప్పంద పత్రం రాసిచ్చారు.