EGS Gram Sabha | చిగురుమామిడి, అక్టోబర్ 24: గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) పథకంలో భాగంగా 2026- 27 సంవత్సరానికి పనులు గుర్తింపు గాను మండలంలోని లంబాడి పల్లి, ముదిమాణిక్యం, పీచుపల్లి, ఓగులాపూర్ గ్రామాల్లోని గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద గ్రామసభ నిర్వహించారు. గ్రామ సభలలో కొత్త పనులు గుర్తింపు పొలం బాటలు, గ్రావెలింగ్ రోడ్లు, వ్యవసాయ ఆధారిత పనులు, ఇంకుడు గుంతలు, కోళ్ల ఫారాలు, పశువుల పాకలు, తోటల పెంపకం మొదలగు పనులను గుర్తించారు.
గ్రామాల్లోని ఈజిఎస్ కూలీలకు పనులు కల్పించాలని నూతన పనులను గ్రామపంచాయతీ గ్రామసభ సమక్షంలో నిర్ణయించడం జరిగిందని ఎంపీడీవో తూమట్ల విజయకుమార్, ఎంపీఓ బత్తిని కిరణ్ కుమార్ తెలిపారు. ఈజీఎస్ కూలీలు పనులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ గ్రామ సభలో ఇంచార్జ్ ఏపీవో రాజు, పంచాయతీ కార్యదర్శులు పద్మావతి, అరుణ్ కుమార్, శ్యామరాణి, నరేష్, ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామస్తులు, ఈజీఎస్ కూలీలు పాల్గొన్నారు.