MLA Medipalli Satyam | ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు కృషి.. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
MLA Medipalli Satyam | గంగాధర, ఫిబ్రవరి 3 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలంలోని బూరుగుపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధి హామీ నిధులు రూ.8 లక్షలతో నిర్మించిన మరుగుదొడ్లు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం సహకారంతో పాఠశాలలో ఏర్పాటుచేసిన లైబ్రరీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ విద్యార్థుల కోరిక మేరకు పాఠశాలలో డైనింగ్ హాల్, తరగతి గదుల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మాలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని కొత్త పాఠశాలల అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు.
బూరుగుపల్లి ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీ ఏర్పాటుకు సహకరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశంను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, స్థానిక సర్పంచ్ దూలం కల్యాణ్, తహసీల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో దామ్ రాము, మండల సర్పంచ్లు సంఘం అధ్యక్షుడు ముద్దం నగేష్, ఉప సర్పంచ్ తిరుపతి, సాగి అజయ్ రావు, దూలం శ్రీనివాస్, దూలం అంజయ్య, బుర్గు గంగన్న, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

