Kalvasrirampur | కాల్వ శ్రీరాంపూర్, జనవరి 27: కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, GIC హరిత సేన రాష్ట్ర కోర్డినేటర్ చెప్యాల రాజేశ్వర్ రావు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ పరిస్థితులపై ఆరా తీశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాజేశ్వర్రావుకు కేసీఆర్ సూచించారు.