DTF | చిగురుమామిడి, జూన్ 25: ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 27న హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని డీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లపల్లి తిరుపతి కోరారు. డిటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మంగళవారం చిగురుమామిడి మండలంలో సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక విద్య లో ప్రతీ తరగతికి ఉపాధ్యాయుడు ప్రఈ20 మంది ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభిస్తుందని అన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సభ్యత్వ నమోదును చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శంకర్, మండల అధ్యక్షులు ముని ప్రసాద్, చంద్రశేఖర్ పాల్గొన్నారు