ఫోన్ పోయిందని దిగులుపడుతున్నారా..? ఇక మీకు దిగులు వద్దు.. ఫోన్ ఎక్కడున్నా క్షణాల్లో ఇట్టే పట్టేయచ్చు. ఇందుకోసం భారత టెలికాం సంస్థ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐటెంటిటీ రిజిస్టర్(సీఈఐఆర్) వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి www.ceir.gov.in వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్టర్ అయి పూర్తి వివరాలు, పోలీస్ కంప్లెయింట్, ఫోన్ కొన్న రసీదు తదితర వివరాలు, నమోదు చేయాలి. ఓటీపీ చెప్పగానే రిజిస్టర్ అయిపోతుంది. ఇంకేముంది ఐఎంఈఐ నంబర్ ద్వారా ఫోన్ ఎక్కడున్నా మీ చేతుల్లో పడుతుంది.
– తెలంగాణ చౌక్, జూన్ 26
తెలంగాణ చౌక్, జూన్ 26: ప్రస్తుత సమాజంలో మొబైల్ ఫోన్ అనేది శరీరంలో ఒక భా గంలా మారిపోయింది. అరచేతిలో సెల్‌ఫోన్ లేకుండా అరనిమిషం కూడా ఉండలేని పరిస్థితికి చేరుకుంది. సుమారు 90శాతానికి పైగా ప్ర జానీకం మొబైల్‌ఫోన్ కలిగి ఉండడంతో పా టుగా తమ పనులను వేగతంగా పూర్తి చేసుకుంటున్నారు. మన జీవితంలో ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న మొబైల్‌ఫోన్ అనుకోని పరిస్థితుల్లో ఎక్కడైనా పోగొట్టుకుంటే ఆర్థిక న ష్టంతో పాటుగా, తమకు సంబంధించిన స మాచారం కూడా ఎంతోనష్టం జరుగుతుంది. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల నుంచి మొ బైల్ వినియోగదారులను గట్టెక్కించేందుక పో లీస్‌శాఖ ఆధ్వర్యంలో సాంకేతికను ప్రయోగిం చి అనేక మార్గాలను ఆవిష్కరించారు. ఇందు లో భాగంగా వినియోగదారులు పోయిన ఫోన్ ను తిరిగి పొందేందుకు సులభమైన మార్గం కోసం భారత టెలికాం సంస్థ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(సీఈఐఆర్) అనే వెబ్‌సైట్‌ను ఆవిష్కరించింది.
‘సీఈఆర్‌ఐ’ని వినియోగించండి ఇలా….
వినియోగదారుడు తమ మొబైల్ ఫోన్ పో గొట్టుకున్నైట్లెతే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ కోసం అందుబాటులో ఉన్న www.ceir.gov.in వెబ్సైట్లోకి వెళ్లాలి. అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్/స్టోలెన్ మొబైల్ అనే ఆప్షన్‌లోకి వెళ్లి పొగొట్టుకున్న డివైస్ ఇన్ఫర్మేషన్ అనగా మొబైల్ నంబర్-1/ 2, ఐఎంఈఐ-1 అంకెలు ఖాళీ బాక్స్‌లలో పేర్కొనాలి. అదేవిధంగా డివైస్ బ్రాండ్(మొబైల్) ఎంపిక చేసుకొని డివైస్ మోడల్ టైప్ చేసి వినియోగదారుడు ఆ ఫోన్ కోనుగొలు చేసినప్పటి ఇన్వాయిస్ రసీదు అప్లోడ్ చేయాలి. లాస్ట్ ఇన్ఫర్మేషన్ అనగా వినియోగదారుడు ఫోన్ పోగొట్టుకున్న ప్రదేశం, తేదీ, రాష్ట్రం, జిల్లా, ఆ ప్రాంత పోలీస్ స్టేషన్ పేరు, పోలీస్ కైంప్లెంట్ నంబర్ పేర్కొని, బాధితుడు పోలీస్ ఫిర్యాదు చేసిన ద రఖాస్తును అప్లోడ్ చేయాలి. అనంతరం ఫోన్ కొన్న అసలు వినియోగదారుడి వ్యక్తిగత సమాచారాన్ని సైతం అందులో పొందుపరుచాలి. ఫోన్ యజమాని పేరు, పూర్తి అడ్రస్ పేర్కొని ఐడెంటిటీ కార్డుని అప్లోడ్ చేయాల్సి ఉంటుం ది. కింద ఉన్న బాక్స్‌లో ఐడెంటిటీ నంబర్‌తో పాటుగా ఈ మొయిల్ ఐడీని నమోదు చేయా లి. కింద క్యాప్చా బాక్సులో వచ్చిన ఆంగ్ల అక్షరాలను పక్కన యథావిధిగా ఎంటర్ చేయా లి. అలాగే వినియోగదారుడి వద్ద ప్రస్తుతం ఉన్న మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి ఓటీపీని పొం దాలి. తరువాత డిక్లరేషన్ వద్ద టిక్ చేసి సబ్మిట్ చేస్తే అనంతరం వినియోగదారుడు ప్రస్తుత మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని బాక్స్‌లో పొందుపరిస్తే సీఈఐఆర్ దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది.
సులభంగా ఛేదించవచ్చు
ఇలా దరఖాస్తు చేసుకున్న అనంతరం బాధితుడి వివరాలు ఆ మొబైల్ సంస్థకు వెళ్తాయి. సీఈఐఆర్ ప్రధాన కార్యాలయం నుంచి వినియోగదారుడికి దరఖాస్తు నిర్ధారణ సందేశం వెళ్తుంది. అనంతరం సబంధిత పోలీస్ స్టేషన్‌కి వినియోగదారుడు పేర్కొన్న వివరాల ఆధారంగా ఆ ఐఎంఈఐ నంబర్‌గల ఫోన్లో మరో నంబర్ వేసిన, దాన్ని వేరేవిధంగా వినియోగించిన వెంటనే సమాచారం వెళ్తుంది. తద్వారా పోలీస్‌లు బాధితుడి పోన్‌ను ఛేదించడం సులభతరమవుతుంది.
మళ్లీ అన్‌బ్లాక్ చేయండి ఇలా….
సీఈఐఆర్ విధానంతో వినియోగదారులు పొగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను పని చేయకుం డా నిలిపివేస్తుంది. ఒకవేళ పోగొట్టుకున్న ఫోన్ దొరికిన అనంతరం వినియోగదారుడు రిక్వెస్ట్ ఫర్ అన్ బ్లాకింగ్/ఫౌండ్ మొబైల్ ఆప్షన్‌లోకి వెళ్లి తమ సందేశం ద్వారా వచ్చిన రిక్వెస్ట్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి అనంతరం దేనివల్ల అన్‌బ్లాక్ చేస్తున్నారనే అంశాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్ నమో దు చేసి సబ్మిట్ కొట్టాల్సి ఉంటుంది. అనంత రం వచ్చే ఓటీపీని వినియోగదారుడు నిర్ధారించుకొని ఫోన్ తిరిగి అన్-బ్లాక్ అవుతుంది.
సాంకేతికతపై అవగహన పెంపొందించుకోవాలి
మొబైల్ వినియోగదారులు అప్రమత్తతో పాటుగా సాంకేతికతపై అవగహన తప్పనిసరి గా పెంపొందించుకోవాలి. ఫోన్ పోగొట్టుకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సీఈఐఆర్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకొని సులభంగా తిరిగి పొందవచ్చును. ప్రతి వినియోగదారుడు సీఈఐఆర్ వెబ్‌సైట్‌పై అవగహన పెంపొందించుకోవాలి. సెల్‌ఫోన్ పోగొట్టుకున్నచో ఆ వెబ్సైట్లో పేర్కొన్న అంశాలను క్రమబద్దం గా పొందుపరుచాలి. ప్రస్తుత సమాజంలో సైబ ర్ నేరాలు సైతం కొత్తకోణాల్లో ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ, తమకు సంబంధించిన పూర్తి సమాచారం పూర్తిగా తెలియని వ్యక్తులకు ఫోన్ ద్వారా వెల్లడించకుడదు.
– అఖిల్ మహాజన్, ఎస్పీ (రాజన్న సిరిసిల్ల)