Early Vinayaka Chavithi | జగిత్యాల, ఆగస్టు 21 : స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తిలో ఎన్ఎస్ఎస్, ఎకోక్లబ్ ఆధ్వర్యంలో ముందస్తు వినాయక చవితి వేడుకలను గురువారం సంబురంగా నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యార్థులు పర్యావరణహితమైన మట్టి వినాయకులను, పసుపు వినాయకులను, పత్రాలతో వినాయకులను, కూరగాయలతో వినాయకులను అందంగా తీర్చిదిద్దారు.
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కల్వకుంట రామకృష్ణ మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే పీవోపీ వినాయకులను కాకుండా, పర్యావరణహితమైన మట్టి వినాయకులను తయారు చేయడం అభినందనీయమని, ఆదిశగా విద్యార్థులను ప్రోత్సహించిన కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు సంగీత, శ్రీలత, సుజాతను అభినందించారు.
వినాయక చవితి సందర్భంగా వినియోగించే వివిధ రకాల పత్రుల యొక్క విశిష్టతలను వివరించారు. వినాయకుల తయారీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ప్రోత్సాహక బహుమతులను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రమోద్ కుమార్, చంద్రయ్య, వాసవి, రహీం, నీరజ, సునీత , జోష్నా, జమున, వీణ, సత్యం ,మల్లికార్జున్, నరేష్, రామచంద్రం, విద్యార్థులు పాల్గొన్నారు.