Early Diwali celebrations | గన్నేరువరం, అక్టోబర్18: గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి శ్రీరామ కృష్ణ హైస్కూల్లో శనివారం ముందస్తు దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల ధరించి దీపాలు వెలిగించి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రామచంద్ర రెడ్డి, పాఠశాల ఇంచార్జ్ గంగారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.