Early Diwali celebrations | పాలకుర్తి : పాలకుర్తి మండలం జీడీ నగర్ యూనివర్సల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శుక్రవారం ముందస్తు దీపావళి సంబరాలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని టపాసులు కాల్చారు.
పండుగ సందర్భంగా విద్యార్థులు ఇండ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఇంతియాజ్, ప్రధానోపాధ్యాయులు అఫ్జల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.