Mulkanur | చిగురుమామిడి, ఏప్రిల్ 7 : చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని మంగళవారం ఉపాధ్యాయులు నిర్వహించారు. ‘ప్రైవేట్ పాఠశాలలు వద్దు-ప్రభుత్వ పాఠశాలలు ముద్దు’ అని నినాదంతో ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాంబారి భారతమ్మ ఇంటింటా తిరిగి కరపత్రాలు అందజేశారు.
ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న ప్రత్యేక సౌకర్యాలు, విద్యా ప్రమాణాలను సర్పంచ్ తో పాటు ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరించారు. పాఠశాలలో ఆంగ్ల విద్య, కంప్యూటర్ ఆధారిత డిజిటల్ బోధన, సీసీ కెమెరాల పర్యవేక్షణ, స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్ సదుపాయం, ఉచిత పుస్తకాలు, యూనిఫామ్, ఆరోగ్యకరమైన మధ్యాహ్న భోజనం, ఆట స్థలం, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులకు ప్రత్యేక విద్యా బోధన, మొదలగు వసతులను ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగిందని వారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శారద, మాజీ ఎంపీటీసీ సాంబారి కొమురయ్య, ఉపాధ్యాయులు భవాని, అనిత, రమ్య, మమత గ్రామస్తులు పాల్గొన్నారు.