చిగురుమామిడి, ఆగస్టు 18 : అఖిలభారత రజక సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా రేకొండ గ్రామానికి చెందిన దుడ్డేల సమ్మయ్య నియామకమయ్యారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షులు మొగ్గ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సమ్మయ్య ఏఐవైఎఫ్ లో చురుగ్గా పనిచేసి జిల్లా కౌన్సిల్ మెంబర్గా ఎన్నికయ్యారు. ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. జిల్లా రజక సంఘం అధ్యక్షుడిగా నియామకమయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు సమ్మయ్య మాట్లాడుతూ రజక సంఘం సమస్యల పరిష్కారం కోసం తన వంతుగా కృషి చేస్తానన్నారు. రజకులకు కమ్యూనిటీ భవనాలు, ప్రతి మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. తన నియామకాన్ని సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సమ్మయ్య కు గ్రామానికి చెందిన రజక సంఘం నాయకులు దుడ్డేల సదానందం, దుడ్డేల అనిల్ కుమార్, దుడ్డేల సుదర్శన్, దుడ్డేల శ్రీనివాస్ అభినందనలు తెలిపారు.