Ramagundam Railway station | జ్యోతినగర్(రామగుండం), మే 15: అమృత్ భారత్ కింద రామగుండం రైల్వేస్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులను గురువారం సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే డివిజినల్ రైల్వే మేనేజర్ భరత్ దేశ్ కుమార్ జైన్ తనిఖీ చేశారు. వ్యాగీన్ల ఆర్ హెచ్ షెడ్, ఇతర నిర్మాణాలను సందర్శనతో తనిఖీ చేసిన ఆయన కొత్తగా ఏర్పాటు చేసిన 11కేవీ విద్యుత్ సబ్ స్టేషన్, వర్కుషాప్ను ప్రారంభించారు. అభివృద్ధి పనులు తుది దశతో నిర్మాణాల ప్రారంభోత్సవ నేపధ్యంతో డీఆర్ఎం పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
ఇక్కడ డిఆర్ఎం వెంట రైల్వే బ్రాంచీ అధికారులు, రామగుండం కమర్షియల్ ఇన్స్పెక్టర్ కార్తీక్, ఎలక్ట్రికల్ ఎస్ఎస్ఈ శ్రీనివాస్, స్టేషన్ మేనేజర్, తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా డీఆర్ఎంకు సమస్యలపై యూనియన్ నాయకులు వినతిపత్రాలు అందజేశారు. స్థానిక కుందనపల్లి వద్ద ఫ్లైవర్ బ్రిడ్జి నిర్మాణం చెపట్టాలని డీఆర్ యుసిసి మెంబర్ జీన్స్ అనుమాస శ్రీనివాస్ వినతిపత్రం అందజేయగా, రైల్వే కాంట్రాక్ట్ కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు అందజేయాలని సీఐటీయూ నాయకులు ఎం రామాచారి వినతిపత్రం అందజేశారు.