Peddapally | పెద్దపల్లి రూరల్ మార్చి 13 : పెద్దపల్లి ఎంపీడీవో కార్యాలయాన్ని జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి కాలిందిణి శుక్రవారం అకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశమైన డీఆర్ డీవో జాతీయగ్రామీణ ఉపాధిహామీ పథకం కింద చేపడుతున్న పనుల వివరాలను, పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
ప్రారంభం కాని పెండింగ్ పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులు సిబ్బందికి సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో కోప్పుల శ్రీనివాస్ , ఏపీవో రమేష్ బాబు, టెక్నికల్ అసిస్టెంట్ లు వెంకటేష్ , దివ్య, పలువురు అధికారులు పాల్గొన్నారు.